India Vs Sri Lanka : Shikhar Dhawan broke Asela Gunaratne thumb | Oneindia Telugu

2017-07-26 2

Sri Lanka's problems have been compounded because Asela Gunaratne has been ruled out of the Test after fracturing his thumb while attempting to go for a catch at the second slip.

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ కొట్టిన బంతిని అందుకునే ప్రయత్నంలో శ్రీలంక క్రికెటర్ తీవ్రంగా గాయపడ్డాడు. రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు క్రికెట్‌లో చోటు దక్కించుకున్న శిఖర్ ధావన్ ఆరంభం నుంచే నిలకడగా ఆడుతూ శ్రీలంక బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌలర్ లాహిరు కుమార బౌలింగ్‌లో ధావన్ కొట్టిన బంతిని.. సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అసేలా గుణరత్నె క్యాచ్‌గా అందుకునేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి వేగం, గమనాన్ని అంచనా వేయడంలో విఫలమైన గుణరత్నె తడబడ్డాడు.ఈ తడబాటుతో అతని ఎడమచేతి బొటనవేలిని చీల్చుకుంటూ బంతి వెళ్లిపోయింది